: తిరుమల దారిలో పోలీసుల కూంబింగ్... కిలో మీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్


అలిపిరి వద్ద బాంబులున్నాయన్న గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్ నేపథ్యంలో తిరుపతి, తిరుమలల్లో గురువారం మొదలైన పోలీసుల సోదాలు నేడు కూడా కొనసాగుతున్నాయి. నిన్నటిదాకా తిరుపతి, తిరుమలలోనే సోదాలు చేసిన పోలీసులు నేటి ఉదయం నుంచి అలిపిరి నుంచి తిరుమల వెళ్లే దారిలో భారీ ఎత్తున కూంబింగ్ చేపట్టారు. అంతేకాక బాంబులు పెట్టామని అగంతుకులు చెప్పిన అలిపిరి వద్ద బాంబ్ స్క్వాడ్ బృందాలు సోదాలను ముమ్మరం చేశాయి. స్కానర్లను రంగంలోకి దించిన పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సోదాలు జరుగుతున్న నేపథ్యంలో అలిపిరి వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక తిరుమలకు వెళ్లేదారితో పాటు తిరుపతికి వచ్చే దారిలోనూ జరుగుతున్న కూంబింగ్ లో దాదాపు 3 వేల మందికి పైగా పోలీసులు పాల్గొంటున్నారు. పారామిలిటరీ బలగాలు కూడా రంగంలోకి దిగాయి.

  • Loading...

More Telugu News