: ‘లింగా’ థియేటర్ల వద్ద రజనీ అభిమానుల కోలాహలం
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం లింగా కొద్ది సేపటి క్రితం ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. 2,400 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల్లో లింగా విడుదలైన థియేటర్ల వద్ద రజనీ అభిమానుల కోలాహలం నెలకొంది. పలు ప్రాంతాల్లో రజనీ పోస్టర్లకు పాలాభిషేకం చేస్తున్న అభిమానులు, చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే, లింగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే పలు థియేటర్లు రోజుల తరబడి అడ్వాన్స్ బుకింగ్ ల ద్వారానే హౌస్ ఫుల్లయ్యాయి. రజనీకాంత్ పుట్టిన రోజు నాడు లింగా విడుదలైన నేపథ్యంలో అభిమానులు మరింత హుషారుగా థియేటర్ల వద్ద పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.