: అమెరికా శాంతి చిహ్నాలుగా సత్యార్థి, మలాలా:తీర్మానం చేయనున్న అమెరికా సెనేట్
బాలల హక్కుల కోసం అలుపెరగని పోరు సాగించి ఈ ఏటీ నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న కైలాష్ సత్యార్థి, మలాలా యూసుఫ్ జాయ్ లకు మరో అరుదైన గౌరవం దక్కనుంది. నిస్వార్థ సేవతో శాంతి బహుమతిని గెలుచుకున్న వారిద్దరినీ శాంతి చిహ్నాలుగా పరిగణించేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఆ దేశ సెనేట్ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా సత్యార్థి ఇప్పటికే 82 వేల మంది బాలలకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించారని సెనేట్ ఆ తీర్మానంలో పేర్కొంది. 11 ఏళ్ల చిన్న వయసు నుంచే మలాలా బాలికల విద్య కోసం ఉగ్రవాదులకు ఎదురొడ్డి పోరాడుతోందని కీర్తించింది. సెనేటర్ టామ్ హార్కిన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.