: నేడు ఏపీలో ఏడీబీ ప్రతినిధి బృందం పర్యటన


ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ప్రతినిధి బృందం నేడు ఆంధ్రప్రదేశ్ లోని పలు నగరాల్లో పర్యటించనుంది. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ కు సంబంధించిన ప్రతిపాదనలపై బ్యాంకు ప్రతినిధులు పరిశీలన జరపనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో పారిశ్రామిక వృద్ధి కోసం ప్రత్యేకంగా విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ ను ఏర్పాటు చేసే విషయాన్ని కేంద్రం విభజన చట్టంలో పేర్కొంది. ఈ కారిడార్ ఏర్పాటులో తమవంతు సహకారం అందించేందుకు ఏడీబీ తనంతతానుగా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు విశాఖకు రానున్న బ్యాంకు ప్రతినిధులు విశాఖతో పాటు రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, తిరుపతి తదితర నగరాల్లో పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏ తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చన్న అంశంపై ఏడీబీ ప్రతినిధులు సమగ్రంగా వివరాలు సేకరిస్తారు. అంతేకాక ఏపీ ప్రభుత్వ అధికారులతోనూ బ్యాంకు ప్రతినిధులు భేటీ కానున్నారు.

  • Loading...

More Telugu News