: చాంపియన్స్ హాకీలో సెమీస్ చేరిన భారత్
భారత హాకీ జట్టు చాంపియన్స్ ట్రోఫిలో సెమీ ఫైనల్ చేరింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ లో బెల్జియంను చిత్తు చేసిన భారత జట్టు నేరుగా సెమీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. గురువారం నాటి క్వార్టర్ ఫైనల్ లో రాణించిన భారత జట్టు బెల్జియంపై 4-2 స్కోరుతో విజయం సాధించింది. ఇక సెమీ ఫైనల్ లో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి, ఫైనల్ చేరాలని భారత క్రీడాకారులు కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు.