: రెబల్ ఎమ్మెల్యేల రెబల్ సమాధానం!


ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్ లను ధిక్కరించిన టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ షోకాజ్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే, ఆ నోటీసులకు జవాబిచ్చే క్రమంలో తమపై తక్షణమే వేటు వేయాలని సదరు రెబల్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు ఇంకా కాలయాపన చేస్తున్నారంటూ సర్కారును ఉడికించే ప్రయత్నం చేశారు.

కొడాలి నాని ఓ అడుగు ముందుకేసి, కిరణ్ సర్కారుకు వ్యతిరేకంగా ఓటేయొద్దంటూ టీడీపీ అధినేత చంద్రబాబు స్వంత పార్టీ ఎమ్మెల్యేలకు సూచించడాన్ని తప్పుబట్టారు. అంతేగాకుండా, ఇలాంటి చర్యలతో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా తగరంటూ, ఆయన స్థానంలో వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను ప్రతిపక్ష నేతగా పరిగణించాలని సూచించారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా తనకు టీడీపీ నుంచి విప్ జారీ కాలేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

  • Loading...

More Telugu News