: మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లు


మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లు నిండాయి. ప్రపంచంలో దారుణ మారణ హోమానికి కారణమైన మొదటి ప్రపంచ యుద్ధం (జూలై 28, 1914 - నవంబర్ 11, 1918) ప్రారంభమై వంద సంవత్సరాలు పూర్తయింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి రేపటికి 96 సంవత్సరాలు కానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఆనాటి యుద్ధంలో పాల్గొని అసువులుబాసిన అమరవీరులను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా స్మరించుకోనుంది. ఈ మేరకు హైదరాబాదులోని చాదర్ ఘాట్ లోని మొదటి ప్రపంచ యుద్ధ స్మారక స్థూపం వద్ద రేపు ఆధికారికంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్, ప్రాన్స్, జర్మనీ దేశాల కౌన్సిల్ జనరల్స్ పాల్గోనున్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో సుమారు 15 లక్షల మంది భారతీయ సైనికులు పాల్గొనగా, వారిలో సుమారు 75 వేల మంది సైనికులు వీరమరణం పొందారు. వారి స్మృత్యర్ధం రేపు చాదర్ ఘాట్ లో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News