: ఆసుపత్రి నుంచి దిలీప్ కుమార్ డిశ్చార్జ్
బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ ముంబయిలోని లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. న్యుమోనియో, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ఈనెల 6న ఆసుపత్రిలో చేరిన ఆయన క్రమంగా కోలుకున్నారు. మరోవైపు, ఈ రోజే దిలీప్ 92వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్దకు వచ్చిన అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. "దిలీప్ సాబ్ చాలా బావున్నారు. ఇక ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరంలేదు. అందుకే మేము ఆయనను డిశ్చార్జ్ చేశాం. ఇప్పటినుంచి రోజువారీ మందులు తీసుకోవచ్చు" అని ప్రసిద్ధ పల్మనాలజిస్ట్ డాక్టర్ జలీల్ పార్కర్ తెలిపారు. ఈ సాయంత్రం దిలీప్ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోనున్నారు.