: గిఫ్ట్ ప్యాక్ రూపంలో ఏపీ ప్రజలకు నిత్యావసరాలు: మంత్రి పరిటాల సునీత
వచ్చే సంక్రాంతి పండుగకు నిత్యావసర సరుకులను ప్రత్యేక గిఫ్ట్ ప్యాక్ రూపంలో అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఈ అంశంపై కేబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వివరించారు. పల్లెల్లో ఎంతో ప్రాధాన్యం ఉన్న సంక్రాంతి పండుగను మరింత ఘనంగా ప్రజలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సునీత వెల్లడించారు.