: రహదారి భద్రత ప్రచారకర్తగా అమీర్ ఖాన్
కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తరపున బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ రహదారి భద్రత రాయబారిగా నియమితులయ్యారు. మూడు రోజుల కిందట (సోమవారం) కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలసిన అమీర్ ఈ విషయంపై చర్చించారట. అయితే, దానికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. భారతదేశంలో నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రతి ఏడాది లక్షకు పైగా చనిపోతున్నారు. ఈ మేరకు ప్రమాదకర డ్రైవింగ్ ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం తరపున ప్రచారం చేయనున్నారని ఓ ఆంగ్ల దినపత్రిక తెలిపింది. ఇప్పటికే కేంద్ర పర్యాటక శాఖ తరపున 'అతిథి దేవో భవ' ప్రచారంలో అమీర్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే.