: గాడ్సే దేశభక్తుడు... తన వ్యాఖ్యలతో బీజేపీని ఇరకాటంలో పెట్టిన సాక్షి మహారాజ్


కేంద్ర మంత్రి సాధ్వి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం, అతి కష్టం మీద బయటపడ్డ బీజేపీ మరో మారు ఇరకాటంలో పడింది. మహాత్మా గాంధీని హత్య చేసిన నాధూరాం గాడ్సే జాతీయవాది, దేశభక్తుడని, ఆ తరువాత మారిపోయాడని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తప్పు తెలుసుకొని "నేనేదైనా తప్పుగా మాట్లాడి ఉంటే... ఆ మాటలు వెనక్కు తీసుకుంటాను. గాడ్సే దేశభక్తుడు అంటే నేను అంగీకరించను" అన్నాడు. సాక్షి మహారాజ్ వ్యాఖ్యలు నేడు పార్లమెంటులో ప్రస్తావనకు వచ్చాయి. మహారాష్ట్రలో భజరంగ దళ్, ఆర్ఎస్ఎస్ లు 'సౌర్య దివస్' పేరిట ప్రతియేటా గాడ్సే సంస్మరణ సభలు జరుపుతున్నా కేంద్రం అడ్డుకోవడం లేదంటూ కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. ఆ వెంటనే వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, "అటువంటి వ్యక్తులను గౌరవించే సమస్యే లేదు. ప్రభుత్వం తరపున సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించం" అని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News