: భారత్, రష్యాల మధ్య పలు కీలక ఒప్పందాలు
భారత్-రష్యా 15వ వార్షిక సమావేశం సందర్భంగా ఇరు దేశాలు పలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న సమావేశంలో రక్షణ, అణు ఇంధన, వాణిజ్య, చమురు, సహజవాయువు తదితర రంగాలకు సంబంధించి 20 ఒప్పందాలు చేసుకున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ల సమక్షంలో రెండు దేశాల విదేశాంగ మంత్రులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఐడీఎఫ్ సీ, రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల సంస్థ మధ్య పెట్టుబడుల ఒప్పందం, భారత్, రష్యా శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థల మధ్య, ఎన్ఆర్ ఆయిల్, రాన్ నెట్ మధ్య చమురు సరఫరా ఒప్పందం తదితరాలపై సంతకాలు చేశారు.