: మార్కెట్లోకి ఆడి నుంచి కొత్త కారు
కార్ల తయారీ దిగ్గజం ఆడి మరో కొత్త కారును భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఏ3 కాబ్రియోలెట్ పేరిట లాంచ్ చేసిన ఈ కారు ధర రూ.44.75 లక్షలు (ఢిల్లీ ఎక్స్ షోరూం). పోర్షె బాక్స్ టర్, మినీ కూపర్ కార్ల తర్వాత భారత మార్కెట్లో అడుగుపెట్టిన కాబ్రియోలెట్ (రిమూవబుల్ టాప్) మోడల్ ఇదే. ఈ కారు టాప్... వెనుక భాగంలో ముడుచుకుని ఉంటుంది. ఓ బటన్ నొక్కడం ద్వారా 18 సెకన్లలో ఇది కారు పైభాగంలో అమరిపోతుంది. కాగా, ఈ కారు పెట్రోల్ వేరియంట్ లో మాత్రమే లభ్యమవుతుంది. 7.8 సెకన్లలోనే 100 కిమీ వేగం అందుకుంటుంది. టాప్ స్పీడు గంటకు 240 కిలోమీటర్లు. ఈ కారులో ట్విన్ క్లచ్ 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు.