: పాతబస్తీ వడ్డీ మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం... 20 మంది అరెస్ట్


అధిక వడ్డీల పేరిట అమాయకులను ముప్పుతిప్పలు పెడుతున్న పాతబస్తీ వడ్డీ మాఫియాపై సౌత్ జోన్ పోలీసులు దాడులు జరుపుతున్నారు. ఇప్పటివరకూ 200 కేసులను నమోదు చేసిన పోలీసులు 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పరిధిలోని యాకుత్‌పురా, భవానీనగర్ ప్రాంతంలో రౌడీషీటర్లు, వడ్డీ వ్యాపారస్తులపై ఈ ఉదయం నుంచి పోలీసులు దాడులు చేస్తున్నారు. వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఓ పహిల్వాన్ నుంచి వందల సంఖ్యలో తనఖా పత్రాలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వడ్డీ వ్యాపారుల ఆగడాలపై స్థానికుల నుంచి వస్తున్న ఫిర్యాదుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో, ఈ సోదాలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News