: తెలంగాణ రైతులెవరూ రుణాలు చెల్లించొద్దు: వామపక్షాలు


తెలంగాణ రైతులెవరూ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి కానీ, ప్రైవేటు బ్యాంకుల నుంచి కానీ తీసుకున్న రుణాలు చెల్లించవద్దని వామపక్షాలు పిలుపునిచ్చాయి. హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద పది వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పలువురు నేతలు మాట్లాడుతూ, రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని అన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపలేదని వారు అభిప్రాయపడ్డారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం రాజకీయాలు చేసుకుంటోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News