: రేవంత్‌రెడ్డిపై పరువునష్టం కేసు


తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్‌ రెడ్డిపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలైంది. మైహోం అధినేత జూపల్లి రామేశ్వర్‌ రావు ఈ పిటిషన్‌ ను దాఖలు చేశారు. నేడు పిటిషన్‌ ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా రామేశ్వర్‌ రావు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి, సమాధానం తెలియజేయాలని రేవంత్ రెడ్డికి నోటీసులు పంపింది. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువైన రామేశ్వర్ రావుకి హైదరాబాద్‌లో భూములు కేటాయించడంపై రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణల వల్ల తన పరువు పోయిందని, అందుకు రేవంత్ రూ.90 కోట్లు చెల్లించాలని రామేశ్వర్ రావు లీగల్ నోటీసులు పంపించారు.

  • Loading...

More Telugu News