: టీడీపీ యువనేతపై లైంగిక వేధింపులు, కిడ్నాప్ కేసు
తెలుగుదేశం పార్టీకి చెందిన యువనేతపై లైంగిక వేధింపులు, కిడ్నాప్ కేసు నమోదైంది. గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బ్రహ్మయ్య గత కొంత కాలంగా ఓ యువతిని లైంగికంగా వేధిస్తున్నారు. అతని వ్యవహారశైలిపై ఆమె ఎదురు తిరగడంతో కాలేజికి వెళ్తున్న ఆమెను కిడ్నాప్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు వినుకోండ పోలీస్ స్టేషన్ లో బ్రహ్మయ్యపై ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.