: భారత మత్స్యకారులను అరెస్టు చేసిన పాక్
పాకిస్థాన్ భద్రత బలగాలు 50 మంది భారత మత్స్యకారులను అరెస్టు చేశాయి. 10 బోట్లను స్వాధీనం చేసుకున్నాయి. పాక్ సముద్ర జలాల్లో చేపల వేట సాగిస్తున్నారంటూ వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మత్స్యకారులను పోలీసులకు అప్పగించనున్నారు. కాగా, ఇటీవల సార్క్ సమావేశం ముగిసిన తర్వాతి రోజే పాక్ 35 మంది భారత మత్స్యకారులను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. చెప్పినట్టుగానే వారికి విముక్తి ప్రసాదించింది. వారు వాఘా చెక్ పోస్టు వద్ద తిరిగి భారత్ లో అడుగుపెట్టారు.