: శ్రీకాకుళం జిల్లాలో స్వల్ప భూకంపం... పరుగులు తీసిన ప్రజలు


శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి, సారవకోట మండలాల పరిధిలోని పలుగ్రామాల్లో నేటి మధ్యాహ్నం భూమి స్వల్పంగా కంపించింది. మధ్యాహ్నం 1.45 - 1.50 గంటల మధ్య భూకంపం వచ్చినట్టు తెలుస్తోంది. సారవకోట, సంతబొమ్మాళి మండల కేంద్రంతోపాటు నర్సాపురం, కోటాడ తదితర గ్రామాల్లో కూడా భారీ శబ్దంతో భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. ఇళ్లలోని అటకలపై ఉన్న వస్తువులు కిందపడ్డాయని వివరించారు. భూమి కంపించడంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లలోంచి వీధుల్లోకి పరుగులు తీశారు. కాగా, ఈ భూకంపం తీవ్రత ఎంతన్నదీ తెలియాల్సి వుంది.

  • Loading...

More Telugu News