: కూకట్ పల్లి వద్ద మెట్రో పనుల్లో అపశృతి
అత్యంత పకడ్బందీగా, ప్రమాద రహితంగా కొనసాగుతున్న హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణంలో అపశృతి దొర్లింది. కూకట్ పల్లి వద్ద మెట్రో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ ఇనుప రాడ్ కిందకు పడింది. ఇది నేరుగా రోడ్డు మీద ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడిపై పడింది. దీంతో, అతను తీవ్రంగా గాయపడ్డాడు. తల పగిలి రక్తస్రావం అయింది. వెంటనే అతడిని కేపీహెచ్ బీ కాలనీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతను ప్రమాదం నుంచి బయటపడ్డాడు.