: 20 ఏళ్లలో భారత్ లో 12 అణు రియాక్టర్లు: రష్యా గ్రీన్ సిగ్నల్


అణు ఇంధన రంగంలో భారత్ కు వెన్నుదన్నుగా నిలిచేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారు. భారత్ తో ద్వైపాక్షిక చర్చల కోసం నేడు ఢిల్లీ వచ్చిన ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అణు ఇంధన రంగానికి సంబంధించిన కీలక ఒప్పందం కుదిరింది. ఇప్పటికే తమిళనాడులోని కూడంకుళం వద్ద అణు రియాక్టర్ నిర్మాణానికి సహకరించిన రష్యా, తాజాగా మరో 12 అణు ఇంధన రియాక్టర్లను నిర్మించి ఇచ్చేందుకు పచ్చజెండా ఊపింది. రానున్న 20 ఏళ్లలో ఈ రియాక్టర్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం పూర్తయితే భారత్ లో రష్యా సహకారంతో నిర్మితమైన అణు రియాక్టర్ల సంఖ్య 13 కు చేరడమే కాక, విద్యుత్ విషయంలో భారత్ స్వయం సమృద్ధి సాధించనుంది.

  • Loading...

More Telugu News