: హైదరాబాద్ రోడ్లపైకి 'షి టాక్సీ'లు... జనవరి 26 నుంచి పరుగులు


ఇక ఆడవాళ్ళు ఒంటరిగా టాక్సీ ఎక్కి ధైర్యంగా ప్రయాణం చేయవచ్చు. ఎందుకంటే టాక్సీని నడిపేది మరో మహిళా డ్రైవర్ కాబట్టి. మహిళా ప్రయాణికులకు మరింత భద్రత కల్పిస్తూ, వచ్చే సంవత్సరం జనవరి 26 నుంచి 'షి టాక్సీ'లు హైదరాబాద్ పరిధిలో సేవలు అందించనున్నాయి. తెలంగాణలో మహిళలు, బాలికల రక్షణ, భద్రతపై ఏర్పాటు చేసిన కమిటీ ఈ మేరకు సిఫార్సులు చేయగా, వాటిని ప్రభుత్వం అంగీకరించింది. సాధ్యమైనంత త్వరగా 'షి టాక్సీ' విధివిధానాలను రూపొందించనున్నట్టు రవాణా శాఖ అధికారి ఒకరు తెలిపారు. కాగా, హైదరాబాద్ లో ఎటువంటి గుర్తింపు లేకుండా క్యాబ్ సేవలందిస్తున్న ఉబెర్ సంస్థపై నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News