: ట్విట్టర్, ఫేస్ బుక్ ఇకపై అత్యుత్తమ పని ప్రదేశాలు కావు!
నిన్నటిదాకా ప్రపంచంలో అత్యుత్తమ పని ప్రదేశాల జాబితాలో అగ్రస్థానాల్లో కొనసాగిన గూగుల్, ఫేస్ బుక్ లు నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయి. అమెరికన్ వెబ్ సైట్ ’గ్లాస్ డోర్’ వెల్లడించిన ‘2015 బెస్ట్ ప్లేసెస్ టు వర్క్’ జాబితాలో ఈ సారి గూగుల్ అగ్రస్థానంలో నిలవగా, గతేడాది రెండో స్థానంలో నిలిచిన మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్... అసలు జాబితాలో చోటు సాధించలేకపోయింది. ఇక సోషల్ నెట్ వర్కింగ్ లో విశ్వవ్యాప్తంగా దూసుకెళుతున్న ఫేస్ బుక్ 13 వ స్థానానికి పడిపోయింది. గతేడాది ఈ జాబితాలో ఫేస్ బుక్ ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ఈ రెండు సంస్థల్లో పని వాతావరణం అంత బాగాలేదని గ్లాస్ డోర్ వెల్లడించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అమెరికా నగరం మాసాచుసెట్స్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న బెయిన్ అండ్ కంపెనీ ఈ ఏడాది జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.