: ఆస్తి పన్ను కట్టడంలేదని చెత్త ట్రాక్టరుతో అధికారుల నిరసన!


కరీంగనర్ జిల్లాలోని గోదావరిఖని పట్టణంలో ఓ వ్యక్తి చేత ఆస్తి పన్ను కట్టించాలని అధికారులు తీవ్ర ప్రయత్నం చేశారు. నాలుగేళ్లుగా బకాయిదారు పన్ను చెల్లించడంలేదు. దాంతో రామగుండం నగర పాలక సంస్థ అధికారులు రంగంలోకి దిగారు. అనుకున్న వెంటనే అతని ఇంటిముందు చెత్త ట్రాక్టర్ తో వెళ్లి పన్ను కడతావా? లేదా? అని నిరసనకు దిగారు. తమకు రావల్సిన రూ.4.96 లక్షల మొత్తం వెంటనే చెల్లించాలని, లేకుంటే ఇంటి ముందు చెత్త పోస్తామని హెచ్చరించారు. అయినా ఆ వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అటు ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అధికారుల చేత నిరసన విరమింపజేయించారు. పన్ను చెల్లించాలని సదరు వ్యక్తికి కూడా పోలీసులు చెప్పారు. మరిప్పటికైనా ఆ వ్యక్తి పన్ను చెల్లిస్తాడో... లేదో!

  • Loading...

More Telugu News