: కోహ్లీ సెంచరీ... ఆస్ట్రేలియా గడ్డపై సత్తా చాటిన యువ కెరటం


ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ధోనీ స్థానంలో జట్టు సారథ్య బాధ్యతలను చేపట్టిన యువ కెరటం విరాట్ కోహ్లీ సత్తా చాటాడు. సెంచరీతో కదం తొక్కాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి... భారీ స్కోరుతో టీమిండియాను ముందుండి నడిపించాడు. మొత్తం 158 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 12 ఫోర్ల సాయంతో శతకాన్ని పూర్తి చేశారు. ఈ క్రమంలో తన టెస్టు కెరియర్లో ఏడో సెంచరీ నమోదు చేశాడు. మరోవైపు, రోహిత్ శర్మ 11 పరుగులతో కోహ్లీకి అండగా ఉన్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 334 పరుగులు.

  • Loading...

More Telugu News