: ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ


ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశమయ్యారు. భారత్-రష్యా 15వ వార్షిక సమావేశం నేపథ్యంలో దేశానికి వచ్చిన పుతిన్ తో ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించే అవకాశం ఉంది. ఈ పర్యటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య అణు శక్తి రంగం, రక్షణ, మార్కెట్ వంటి 20 అంశాలపై ఒప్పందం కుదరనుంది. మరోవైపు మోదీ ట్విట్టర్ లో స్పందిస్తూ "రష్యా అధ్యక్షుడు పుతిన్ ను భారత్ కు ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. ఈ పర్యటన రెండు దేశాల సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకువెళుతుందని ఆశిస్తున్నా" అని పేర్కొన్నారు. అయితే కాలం మారుతున్నా తమ స్నేహం మాత్రం మారదని, ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నట్టు మోదీ తెలిపారు.

  • Loading...

More Telugu News