: ఢిల్లీలో మా పోరు ముఖీ పైనే... మోదీపై కాదు: కేజ్రీవాల్ వ్యూహాత్మక ఎత్తుగడ


ఢిల్లీ తాజా మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోమారు సీఎం పీఠంపై కన్నేశారు. తొలిసారి అందివచ్చిన అధికారాన్ని చేజేతులారా జార్చుకున్న ఆప్ అధినేత, ఈసారి మాత్రం ఆ పొరపాటు చేయనని, అధికారమిస్తే ఐదేళ్లు పాలిస్తానని ప్రచారం మొదలుపెట్టారు. అయితే విద్యావంతులైన ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ మాటలను అంత ఈజీగా నమ్ముతారా?... ఇదే అనుమానం కేజ్రీవాల్ కూ వచ్చింది. మరోవైపు ఒంటిచేత్తో బీజేపీకి అధికారాన్ని అందించిన ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో బీజేపీ బరిలోకి దిగుతుండటం ఆయనను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి చెక్ పెట్టేందుకు కేజ్రీవాల్, వ్యూహాత్మక ఎత్తుగడలకు తెర తీశారు. ఇందులో భాగంగా ఎన్నికల్లో తమ ప్రత్యర్థి జగదీశ్ ముఖీనే కానీ, మోదీ కాదని ప్రచారం మొదలెట్టారు. ఇప్పుడిప్పుడే వెలసిన ఈ పోస్టర్లు నగరంలోని అన్ని ప్రాంతాలకు చేరుతున్నాయట. అదేంటీ, తమ ప్రధాన ప్రచారకర్త మోదీ అని బీజేపీ చెబుతుంటే, మీరేమో ముఖీ పేరు చెబుతున్నారని అడిగిన మీడియాకు ఆప్ నేతలు పొంతనతో కూడిన సమాధానమే చెబుతున్నారు. ‘‘గతంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం జగదీశ్ ముఖీ, పలుమార్లు లెఫ్ట్ నెంట్ గవర్నర్ ను కలిశారు. ఈ క్రమంలో ఆయనే ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా భావిస్తున్నాం. వేరే వారైతే... వారి పేరు చెప్పమనండి. ఆ పార్టీ ప్రకటించే అభ్యర్థితోనే పోస్టర్లు వేస్తాం’’ అంటూ ఆప్ నేతలు ముందుగానే సిద్ధం చేసుకున్న సమాధానాన్ని చదివేస్తున్నారట.

  • Loading...

More Telugu News