: అధిక బరువును తగ్గించే దివ్యౌషధం... మీ వంటింట్లోనే!


అధిక బరువును తగ్గిస్తూ, శరీరాన్ని ఫిట్ గా ఉంచే దివ్యౌషధం మీ వంటింటి కూరగాయల బుట్టలోనే ఉంది. అది ఏంటో తెలుసా? బంగాళదుంప. అవును... మీరు విన్నది నిజమే! కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్ లు ఉండే బంగాళదుంపలను ఎంత ఎక్కువగా తింటే, స్థూలకాయం బాధ అంతగా తగ్గుతుందట. కెనడాకు చెందిన మెక్ గిల్ యూనివర్సిటీ సైంటిస్ట్ లు ఓ అధ్యయనంలో ఈ విషయాన్ని గుర్తించారు. బంగాళదుంపల్లో పాలీఫినాల్స్ అధికంగా ఉండటమే ఇందుకు కారణమట. "మా అధ్యయనంలో వెల్లడైన ఫలితాలు మమ్మల్నే విస్మయపరిచాయి" అని అధ్యయనం రచయితలలో ఒకరైన లూయిస్ ఎజిలాన్ వ్యాఖ్యానించారు. ఇదే తరహా ప్రయోగాన్ని మరో సీజన్లో పండిన బంగాళదుంపలతో చేయనున్నామని ఆయన తెలిపారు. స్థూలకాయంతో పాటు టైప్-2 మధుమేహ వ్యాధి బారి నుంచి కూడా బంగాళదుంపలు కాపాడతాయని వివరించారు.

  • Loading...

More Telugu News