: కోహ్లీని ఢీకొట్టిన జాన్సన్ బౌన్సర్


ఆస్ట్రేలియా బౌలర్ల చేతుల్లోనుంచి మళ్లీ అదే బౌన్సర్ బాల్. అయితే ఈసారి సదరు ఆసిస్ బౌన్సర్ ను ఎదుర్కొన్న బ్యాట్స్ మన్ మాత్రం ఆ దేశస్థుడు కాదు. భారత క్రికెట్ ఆశాకిరణం, టీమిండియా వైెస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ నుంచి దూసుకొచ్చిన ఆ బౌన్సర్ నేరుగా కోహ్లీ తలను ఢీకొట్టింది. ఒక్కసారిగా అంతా షాక్. ఫీల్డర్లతో పాటు బౌన్సర్ విసిరిన జాన్సన్ కూడా కోహ్లీ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చారు. బౌన్సర్ దెబ్బతో కాస్త ఇబ్బంది పడ్డా హెల్మెట్ తీసిన కోహ్లీ తనకేమీ కాలేదని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మురళీ విజయ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీకి తొలి బంతే బౌన్సర్ గా దూసుకొచ్చింది. ఈ ఘటన తర్వాత ఆసీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్, జాన్సన్ కు క్లాసు పీకినంత పనిచేశారు. ఆ తరహా బాల్స్ వేయొద్దంటూ కెప్టెన్ చెప్పడంతో జాన్సన్ కాస్తంత ఇబ్బందిని ఎదుర్కోకతప్పలేదు. ఆసీస్ బౌలర్ అబాట్ విసిరిన బౌన్సర్ కు గురైన ఆ దేశ బ్యాట్స్ మన్ ఫిలిప్ హ్యూస్ మృత్యువాత నేపథ్యంలో బౌన్సర్ లపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

  • Loading...

More Telugu News