: ఆసియా శృంగార పురుషుడిగా హృతిక్ రోషన్
ఆసియా అత్యంత శృంగార పురుషుడిగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఎంపికయ్యాడు. ప్రతి ఏడాదిలానే పలువురు సెలబ్రిటీలతో బ్రిటన్ కు చెందిన 'ఈస్టర్న్ ఐ' అనే వారపత్రిక ఓ జాబితా రూపొందించింది. 'ప్రపంచంలోని 50 మంది ఆసియా శృంగార పురుషులు' పేరుతో ఈ ఏడాది జాబితాను విడుదల చేసింది. గతంలో రెండుసార్లు ఈ టైటిల్ కు ఎంపికైన హృతిక్, తాజాగా మూడోసారి శృంగార పురుషుడిగా ఎన్నిక కావడం విశేషం. తనను ఆసియా శృంగార పురుషుడిగా ఎన్నుకోవడంపై హృతిక్ స్పందిస్తూ, "'ఈస్టర్న్ ఐ'కు కృతజ్ఞతలు. ఈ ట్యాగ్ నాకు దక్కడం చాలా గర్వంగా ఉంది" అని అన్నాడు. ఇక టీవీ నటుడు కుశాల్ టండాన్ ఈ జాబితాలో రన్నరప్ గా నిలిచాడు. గతేడాది విజేత అయిన నటుడు, గాయకుడు అలీ జాఫర్ ఈ జాబితాలో మూడో స్థానానికి పడిపోయాడు.