: చిత్తూరు పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరారు. హైదరాబాదులోని బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన చిత్తూరు జిల్లాకు వెళ్లారు. పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రైతు రుణమాఫీలో భాగంగా ఆయన రైతు సాధికారత సదస్సును చిత్తూరులో ప్రారంభించనున్నారు. రుణమాఫీకి సంబంధించిన బాండ్లను జిల్లా రైతులకు అందజేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. అక్కడ దాదాపు గంటన్నరపాటు పారిశ్రామికవేత్తలతో కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు.