: మోదీ మాటకు తలూపిన ఐరాస


ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్థాయిలో తన పలుకుబడి పెంచుకుంటున్నారు. మోదీ విజ్ఞప్తికి ఐక్యరాజ్యసమితి సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలో, జూన్ 21వ తేదీని 'వరల్డ్ యోగా డే'గా ప్రకటించేందుకు అంగీకరించింది. దీనిపై గురువారం ప్రకటన చేయనున్నారు. సెప్టెంబరులో మోదీ ఐరాస సాధారణ సభలో మాట్లాడుతూ, అంతర్జాతీయ సమాజం యోగాను గుర్తించాలన్నారు. 170 దేశాలు మోదీ ప్రతిపాదనకు సమ్మతి తెలిపాయి. అంతేగాకుండా, 28 సభ్య దేశాల యూరోపియన్ యూనియన్ (ఈయూ) కూడా 'యోగా డే' ఆలోచనకు మద్దతు ఇస్తోంది. ఈయూ అధ్యక్షుడు హెర్మన్ వాన్ రోంపీ ఈ మేరకు మోదీకి హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News