: టీ విరామసమయానికి భారత్ స్కోరు 225/3
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఎలాంటి తడబాట్లకు చోటివ్వకుండా నిలకడగా ఆడుతోంది. మూడో రోజు టీ విరామ సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 48 పరుగులతో (6 ఫోర్లు), అజింక్య రహానే 19 పరుగులతో (4 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఈ రోజు మరో 37 ఓవర్ల ఆట మిగిలి ఉంది.