: నైటీతో బయటికి వస్తే రూ.500 జరిమానా... ఓ మహిళా సంఘం ఆదేశం


మహిళల వస్త్రధారణ బాగుంటే అత్యాచారాలు ఎందుకు జరుగుతాయి? అని ఓ మహిళా మండలి ప్రశ్నిస్తోంది. అంతే కాదు, మహిళలు బయటికి వెళ్లేటప్పుడు గౌన్లు (నైటీలు, మ్యాక్సీలు) వేసుకోవడంపై నిషేధం కూడా విధించింది! నైటీతో బయటికి వస్తే రూ.500 జరిమానా విధిస్తామని హుకుం జారీ చేసింది. ఎక్కడో తెలుసా..? నవీ ముంబైలోని గోఠివలి గ్రామంలో... ఈ ప్రాంతంలో అధికంగా నివశించే 'ఆగ్రీ' సమాజ్ వారు స్థానిక మహిళలతో కలసి 'ఇంద్రాయణి' పేరిట ఓ మహిళా మండలిని ఏర్పాటు చేసుకొని మహిళా సమస్యలపై తరచూ సమావేశమై చర్చిస్తుంటారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలను అడ్డుకోవడం ఎలా? అనే విషయంపై ఇటీవల జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదేశాల గురించి గ్రామ కూడలిలో ఒక పెద్ద బోర్డును పెట్టారు. తాము చేసింది సబబేనని ఇంద్రయాణి మహిళా మండలి సభ్యులు చెబుతుండగా, ఇది ఏకపక్ష ధోరణి అంటూ, కొందరు తప్పుబడుతున్నారు.

  • Loading...

More Telugu News