: దేశం తగలబడిపోయినా ఫరవా లేదు... బీజేపీకి అధికారం కావాలంతే!: రాహుల్


ప్రధాని నరేంద్ర మోదీ సర్కారుపై తరచూ విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఈ సారి తన విమర్శలకు మరింత పదును పెట్టారు. కేరళ పర్యటనలో భాగంగా బుధవారం తిరువనంతపురంలో మాట్లాడిన సందర్భంగా ఆయన మోదీ సర్కారు వైఖరిని తీవ్ర స్థాయిలో దునుమాడారు. ‘‘దేశం తగలబడిపోయినా ఫరవా లేదు... వారికి మాత్రం అధికారం కావాలి’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ వాస్తవ దృక్పథం బోధపడిందని తన పార్టీ కార్యకర్తలకు చెప్పిన రాహుల్ గాంధీ, ‘‘వారి ఏకైక లక్ష్యం అధికారం చేజిక్కించుకోవడమే. ప్రజలు పోరాడినా ఫరవా లేదు. రక్తపాతం జరిగినా పట్టింపు లేదు. చివరకు దేశం యావత్తు తగలబడిపోయినా వారికి అనవసరం. వారికి కేవలం అధికారం మాత్రమే కావాలి’’ అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని రాహుల్ ‘‘మోదీకి ప్రజలు ఓ అవకాశమిచ్చారు. అయితే ఈ ఆరు నెలల కాలంలో ఆయన ఏం చేశారని ప్రశ్నించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఉద్యోగాలు ఎక్కడ? అభివృద్ధి ఎక్కడ? అనే ప్రశ్నలు మోదీకి ఎదురుకానున్నాయి’’ అని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News