: రూ.2 వేలకే ఎయిర్ కోస్టా విమాన టికెట్
లోకాస్ట్ ఎయిర్ లైన్ సంస్థ ఎయిర్ కోస్టా నూతన సంవత్సరం సందర్భంగా కేవలం రూ.2 వేలకే విమాన టికెట్లను విక్రయించనుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ, చెన్నై, బెంగళూరు, తిరుపతిలకు టికెట్ ధరను రూ.2,015గా (అన్ని పన్నులు కలుపుకొని) నిర్ణయించింది. నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు బుకింగ్ చేసుకున్న వారికి ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుందని, ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 15 లోపు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చని తెలిపింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్, విజయవాడ, తిరుపతిలకు, విజయవాడ నుంచి వైజాగ్, తిరుపతిల మధ్య టికెట్ ధర రూ.2,499గా నిర్ణయించినట్టు ఎయిర్ కోస్టా ఎండీ ఎల్‌వీఎస్ రాజశేఖర్ తెలిపారు.