: పుజారా క్లీన్ బౌల్డ్... భారత్ 196/3
కీలక సమయంలో భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత ఇన్నింగ్స్ సజావుగా సాగుతున్న సమయంలో ఛటేశ్వర్ పుజారా ఔట్ అయ్యాడు. 9 ఫోర్ల సహాయంతో 73 పరుగుల చేసి శతకం వైపు దూసుకుపోతున్న పుజారా... లియాన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లియాన్ విసిరిన ఆఫ్ బ్రేక్ బంతిని పుజారా డిఫెన్స్ ఆడబోయాడు. అయితే, టర్న్ అయిన బంతి పుజారా బ్యాట్ అంచును తాకుతూ వెళ్లి వికెట్లను గిరాటేసింది. ప్రస్తుతం భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు. కోహ్లీ 36, రహానే 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.