: భారత సుందరాంగికి తొలిసారిగా 'మిస్ యూనివర్స్ పీస్' టైటిల్


భారతీయ వనిత రూహీ సింగ్ మిస్ యూనివర్స్ పీస్ అండ్ హ్యుమానిటీ టైటిల్ గెలుచుకున్నారు. లెబనాన్‌లో జరిగిన ఈ పోటీలో 145 దేశాల యువతులు పాల్గొన్నారు. ఓ భారతీయురాలికి ఈ కిరీటం దక్కడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రూహీ సింగ్ మాట్లాడుతూ తనకెంతో ఆనందంగా ఉందని, భారత్‌కు త్వరితగతిన చేరుకుని, సన్నిహితులతో ఆనందం పంచుకోవాలని ఎదురుచూస్తున్నానని తెలిపింది. తనకు ఈ అవకాశం కల్పించిన మిస్ ఇండియా ఆర్గనైజేషన్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. కాగా, ఈ కిరీటం కింద రూహీ సింగ్ కు 50 వేల డాలర్ల నగదు బహుమతి అందజేశారు.

  • Loading...

More Telugu News