: కేసీఆర్ కోసం పరుగులు పెట్టిన కరీంనగర్ కలెక్టర్


ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ లో సాక్ష్యాత్తు కలెక్టర్ కూర్చునేందుకు స్థానం లేకపోయింది. దీంతో చేసేదేమీలేక కాన్వాయ్ వెంట ఆయన పరుగులు పెట్టాల్సివచ్చింది. చెమటలు పడుతున్నా, ఆయాసపడుతూనే ఆగకుండా సుమారు పావు కిలోమీటరు దూరం కరీంనగర్ జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య పరుగెత్తారు. నిన్న సిద్దిపేట నీటి సరఫరా పథకాన్ని సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలసి పరిశీలించిన సంగతి తెలిసిందే. పంప్‌ హౌస్ వద్దకు వెళ్లేందుకు సీఎం కాన్వాయ్‌తో పాటు మరో రెండు వాహనాలను మాత్రమే సెక్యూరిటీ సిబ్బంది అనుమతించారు. ఒక వాహనంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, మరో వాహనంలో ప్రజాప్రతినిధులు ఉండటంతో కలెక్టర్‌కు చోటు లేకుండా పోయింది. ఆయనను పిలిచి కొంచెం సర్దుకొని కూర్చుందామని కూడా ఎవరికీ అనిపించలేదు. దీంతో చేసేదేమీ లేక కలెక్టర్ సీఎం కాన్వాయ్ వెంట పరుగులు తీయాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News