: పుజారా హాఫ్ సెంచరీ... భారత్ 162/2
అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ధాటిగా ఆడుతోంది. భారత్ బ్యాట్స్ మెన్ పుజారా 8 ఫోర్ల సహాయంతో 64 పరుగులతో, కోహ్లీ 3 ఫోర్లతో 20 పరుగులతో ఆడుతున్నారు. ఈ క్రమంలో పుజారా టెస్టుల్లో తన 5వ అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 167 పరుగులు. అంతకు ముందు ఆస్ట్రేలియా 517 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.