: తనకే రక్షణ లేదంటున్న జయప్రద
స్వంత నియోజకవర్గం రాంపూర్ లో ఇటీవల తన పట్ల పోలీసులు, రవాణా శాఖ అధికారులు దురుసుగా ప్రవర్తించడం వెనుక రాజకీయ ప్రత్యర్థి అజంఖాన్ హస్తముందని ఎంపీ జయప్రద ఆరోపించారు. ఓ మహిళా ఎంపీకే రక్షణ లేకపోతే సామాన్య స్త్రీలకు ఏం భద్రత ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని జయప్రద డిమాండ్ చేశారు. కొద్ది రోజుల క్రితం జయప్రద కారుపై ఉన్న ఎర్రలైటును రవాణా శాఖ అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే.