: నేడు హాకీ చాంపియన్స్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్..బెల్జియంతో భారత్ ఢీ


హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరిన భారత హాకీ జట్టు నేడు బెల్జియం జట్టుతో తలపడనుంది. మంచి ఊపుమీదున్న భారత జట్టు ఈ మ్యాచ్ లోనూ విజయం సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు భువనేశ్వర్ లో జరగనుంది. గత మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను మట్టికరిపించిన భారత జట్టు, నేటి క్వార్టర్ ఫైనల్ లోనూ బెల్జియంను ఓడించి సెమీ ఫైనల్ లోకి దూసుకెళ్లేందుకు ఉవ్విళ్లూరుతోంది.

  • Loading...

More Telugu News