: నేడు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన ఇలా సాగుతుంది!


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. రైతు రుణమాఫీలో భాగంగా ఆయన రైతు సాధికారత సదస్సును చిత్తూరులో ప్రారంభించనున్నారు. ఈ సదస్సులోనే రైతు రుణమాఫీకి సంబంధించిన బాండ్లను ఆయన జిల్లా రైతులకు అందజేస్తారు. నేటి ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరనున్న చంద్రబాబు 10 గంటలకు చిత్తూరు చేరుకుంటారు. మాజీ ఎంపీ, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులునాయుడు మెమోరియల్ ఆస్పత్రిని చంద్రబాబు ప్రారంభిస్తారు. అనంతరం నగరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత నగరంలోని కొంగారెడ్డిపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల నీటి పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రైతు సాధికారత సదస్సులో పాల్గొనే చంద్రబాబు మధ్యాహ్నం తర్వాత 3 గంటలకు చిత్తూరు జిల్లాలోని తిరుపతి నగరానికి చేరుకుంటారు. అక్కడ దాదాపు గంటన్నరపాటు పారిశ్రామికవేత్తలతో కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం ఆయన హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారు.

  • Loading...

More Telugu News