: భారత్ లో విక్రయాలు నిలిపేయండి: జియోమీకి ఢిల్లీ హైకోర్టు ఆదేశం


చైనా యాపిల్ గా పేరుగాంచిన స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం జియోమీకి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఇకపై భారత్ లో విక్రయాలు జరపరాదని, భారత్ కు తన స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేయరాదని ఆదేశిస్తూ మంగళవారం తీర్పు చెప్పింది. మొబైల్ తయారీలో మునుపటి తరం దిగ్గజం ఎరిక్ సన్ వేసిన పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్ఆర్ఏఎన్డీ నిబంధనల మేరకు భారత్ లో మొబైల్ ఫోన్లను విక్రయించాలనుకునే విదేశీ సంస్థ, ఎరిక్ సన్ కు నిర్ణీత మేర రుసుమును చెల్లించాల్సి ఉంది. అయితే జియోమీ ఈ నిబంధనను అతిక్రమించి, తనకు ఎలాంటి ఫీజు చెల్లించకుండానే భారత్ లో విక్రయాలు కొనసాగిస్తోందని ఎరిక్ సన్ తన పిటిషన్ లో పేర్కొంది. అంతేకాక తాను పంపిన నోటీసులకు జియోమీ స్పందించలేదని కూడా ఎరిక్ సన్ వాపోయింది. ఎరిక్ సన్ వాదన విన్న ఢిల్లీ హైకోర్టు భారత్ లో విక్రయాలు నిలిపేయాల్సిందిగా జియోమీని ఆదేశించింది. భారత్ లో భారీ క్రేజ్ ఉన్న జియోమీ ఫోన్లు క్షణాల వ్యవధిలో విక్రయమైపోతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News