: ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కోచ్ గా ఆసిస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్


రిలయన్స్ గ్రూపు ఆధ్వర్యంలోని ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ కోచ్ గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ బుధవారం ప్రకటించింది. ఐపీఎల్ 6 దాకా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా వ్యవహరించిన పాంటింగ్, త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 8లో అదే జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ముంబై ఇండియన్స్ కోచ్ గా టీమిండియా మాజీ కోచ్ జాన్ రైట్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జాన్ రైట్ ను కొనసాగిస్తూనే, రికీ పాంటింగ్ ను చీఫ్ కోచ్ గా నియమించుకుంటున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. సత్తా ఉన్న యువతను కనుగొనడంతో పాటు వారిలోని నైపుణ్యానికి మరింత మెరుగుపెట్టే గురుతర బాధ్యతలను ఇకపై జాన్ రైట్ తీసుకుంటారని బుధవారం నాటి విలేకరుల సమావేశంలో ముంబై ఇండియన్స్ సలహాదారు అనిల్ కుంబ్లే వెల్లడించారు.

  • Loading...

More Telugu News