: బీమా బిల్లును ఆమోదించిన కేంద్ర కేబినెట్
బీమా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. సవరణలు లేకుండా తెస్తే బీమా బిల్లును అడ్డుకుని తీరుతామని కొన్ని పార్టీలు ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ బీమా బిల్లుకు ఆమోదం తెలపడం సాహసమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీమా బిల్లులో చాలా లోపాలు ఉన్నాయని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు బీమా రంగంలో అవకాశం కల్పించడం ద్వారా కేంద్రం తప్పు చేస్తోందని పలు పార్టీలు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బీమా బిల్లుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో సోమవారం బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.