: ఉబెర్ జీఎంపై ముంబైలో దాడికి యత్నం


ఉబెర్ ట్యాక్సీ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబైలో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీలో జరిగిన పరిణామాలపై ఆగ్రహించిన ఓ వ్యక్తి ఏకంగా ఉబెర్ జీఎంపై దాడికి యత్నించాడు. ఉబెర్ ట్రావెల్స్ జీఎం శైలేష్ సావ్లానీ ముంబై ట్రాన్స్ పోర్టు కమిషనర్ ను కలవడానికి వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. అతను దాడి చేసినప్పుడు అప్రమత్తంగా ఉండడంతో శైలేష్ తప్పించుకోగలిగారు. అయితే దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరనేది తెలియరాలేదు. ముంబై పోలీసులు నగరంలోని ఉబెర్ ట్యాక్స్ లు, డ్రైవర్లకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని కోరడంతో జీఎం కమిషనర్ ను కలిసేందుకు వెళ్లారు. కాగా, ఉబెర్ క్యాబ్ లపై దేశ వ్యాప్తంగా నిషేధం నడుస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రలో మాత్రం ఆ సంస్థ క్యాబ్ లు నడుస్తున్నాయని సమాచారం.

  • Loading...

More Telugu News