: కప్పట్రాళ్లలో మిన్నంటిన రోదనలు
కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో రోదనలు మిన్నంటాయి. ఆరేళ్లుగా న్యాయస్థానంలో నలిగిన ఫ్యాక్షన్ హత్యల కేసులో నంద్యాల కోర్టు సంచలనాత్మక తీర్పునివ్వడంతో శిక్ష ఖరారైన బంధువుల రోదనలతో న్యాయస్థానం పరిసరాలతో పాటు, కప్పట్రాళ్ల గ్రామంలోని వారి బంధువులంతా విషాదంలో మునిగిపోయారు. తమ వారు అన్యాయంగా శిక్షకు గురయ్యారని వారంతా వాపోయారు. ఐదుగురేసి పిల్లలున్న వారు కూడా ఇందులో బాధితులుగా మారిపోయారని వారు ఆరోపించారు. తమ కుటుంబాల పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. తమ వారిని రాజకీయ నాయకులు ఇరికించారని, తమ వారు ఎలాంటి దారుణాలకు పాల్పడలేదని పలువురు బావురుమన్నారు. పోలీసులు మాత్రం ఈ శిక్షలు ఫ్యాక్షనిస్టులకు కనువిప్పు లాంటివని అభిప్రాయపడ్డారు.