: కాంస్య పతకం అందుకున్న సరితాదేవి...సచిన్ దౌత్యం ఫలించినట్టే!


క్రికెట్ దిగ్గజం సచిన్ దౌత్యం ఫలించింది. బాక్సింగ్ లో ఎంతో భవిష్యత్ ఉన్న సరితాదేవిని నిషేధించడం మంచిది కాదని, అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య నిర్ణయం వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తేవాలంటూ సచిన్ భారత బాక్సింగ్ సమాఖ్యను కోరారు. దీంతో భారత బాక్సింగ్ సమాఖ్య అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్యతో చర్చలు జరిపింది. ఈ నేఫథ్యంలో బాక్సర్ సరితా దేవి గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో పోడియంపై వదిలేసిన కాంస్య పతకాన్ని భారత ఒలింపిక్ సంఘం నుంచి స్వీకరించింది. దీంతో ఈ వివాదం సమసిపోయినట్టేనని బాక్సింగ్ సమాఖ్య అధికారులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ సమాఖ్య, సరితాదేవి రాజీ పడడం వెనుక సచిన్ ప్రభావం ఉందని పలువురు అభిమానులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News