: మాతృదేశంలో సేవ చేయాలనుకుంటున్నా: మలాల


తన మాతృదేశం పాకిస్థాన్ లో సేవ చేయాలని కోరుకుంటున్నానని, అందుకోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానని నోబుల్ శాంతి పురస్కార విజేత మలాల యూసఫ్ జాయ్ తెలిపింది. ఓస్లోలో జరుగుతున్న నోబుల్ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, బాలికల విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పింది. ఏ చిన్నారి కూడా ఉగ్రవాదులకు బలికాకూడదని కోరుకుంది. నోబుల్ బహుమతితో తనపై బాధ్యత మరింత పెరిగిందని అభిప్రాయడింది. భారత్, పాక్ ప్రధానుల భేటీ జరగాలని తాను కోరుకుంటున్నట్లు మలాల వెల్లడించింది.

  • Loading...

More Telugu News